VIDEO: రోడ్డు ప్రమాదాలపై వీడియో విడుదల
సిరిసిల్లలో ఎస్పీ మహేష్ బీ గీతే రోడ్డు ప్రమాదాలపై గురువారం ఓ వీడియో విడుదల చేశారు. వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నియమ నిబంధనలు పాటించకపోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయని వివరించారు. జాగ్రత్తలు పాటించకపోవడం ద్వారా ఎలా రోడ్డు ప్రమాదాలు జరుగుతాయో వీడియో పాట రూపంలో తెలిపారు.