గవర్నర్ పర్యటనలో అధికారులు సకాలంలో హాజరు కావాలి

ఖమ్మం: శ్రీరామనవమి సందర్భంగా రేపు మహా పట్టాభిషేకం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ విచ్చేయనున్నందున విధులు కేటాయించిన అధికారులు ఉదయం 6 గంటలకే కేటాయించిన విధులకు హాజరుకావాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల తెలిపారు. గవర్నర్ పర్యటనపై బుధవారం ఐటీసీ విశ్రాంతి భవనంలో రెవెన్యూ, డీఆర్డిఎ, జడ్పీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులతో సమీక్షించారు.