రేపే వినాయక చవితి.. విగ్రహం ఏ సమయంలో పెట్టాలంటే..?

CTR: ఈ ఏడాది చవితి తిథి సెప్టెంబర్ 6, 7 తేదీల్లో ఉంటుందని పండితులు తెలిపారు. అయితే ధృక్ సిద్ధాంతం ప్రకారం 7నే (శనివారం) వినాయక చవితి జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం 11.03 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్యలో గణేశుడి విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ ముహూర్తం ఉందని పేర్కొన్నారు. సాయంత్రం 6. 22 గంటల నుంచి రా.7.30 మధ్యలో వరసిద్ధి వినాయక వ్రత సంకల్పం చేసుకోవచ్చని చెబుతున్నారు.