బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

బాధిత కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ

HYD: ఆర్థికంగా చితికిపోయిన వారికి అనారోగ్య సమస్యల్లో ఉన్నప్పుడు సీఎం, పీఎం రిలీఫ్ ఫండ్ పథకాలు ఎంతో బాసటగా నిలుస్తాయని కేంద్రమంత్రి గంగాపురం కిషన్ రెడ్డి అన్నారు. ఖైరతాబాద్‌కు చెందిన అనురాధ అనే బాధితురాలు కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందింది. ఆమెకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరైన చెక్కును కేంద్రమంత్రి గురువారం అందజేశారు.