గుంతలోకి దూసుకెళ్లిన కంటైనర్

KNL: ఎమ్మిగనూరు మండలం చీరాలదొడ్డి-ఎర్రకోట సమీపంలో గురువారం రాత్రి మహారాష్ట్రకు చెందిన కంటైనర్ అతివేగంగా వస్తూ అదుపుతప్పి గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు గమనించి వెళ్లి చూడగా.. డ్రైవర్, క్లీనర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా లారీ నడపడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు.