పామాయిల్ తోటకు నిప్పంటించిన దుండగులు
KMM: బోనకల్ మండలం రాయన్నపేటలో గుర్తు తెలియని వ్యక్తులు పామాయిల్, కొబ్బరి, నిమ్మ తోటలకు నిప్పు పెట్టారు. రైతు పోతురాజు లావణ్యకు చెందిన మూడు ఎకరాల సాగు భూమి ఈ ప్రమాదంలో దగ్ధమైంది. పంట కాపుకు వచ్చే దశలో తోట కాలిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.