122 రైల్వేస్టేషన్లలో స్విగ్గీ 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవలు

122 రైల్వేస్టేషన్లలో స్విగ్గీ 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవలు

దేశంలోని 122 రైల్వే స్టేషన్లలో తన 'ఫుడ్ ఆన్ ట్రైన్' సేవలను విస్తరించినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రయాణికుల నుంచి మంచి స్పందనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఇప్పటివరకు 24 గంటల ముందే ఇచ్చే ప్రీ ఆర్డర్ సదుపాయాన్ని ఇప్పుడు 96 గంటలకు పెంచినట్లు చెప్పింది. తద్వారా కస్టమర్ల ప్రయాణానికి ముందే ఆర్డర్ చేసుకుని స్థానిక రుచులను ఆశ్వాదించవచ్చని పేర్కొంది.