భాకరాపేటలో నకిలీ CI హల్‌చల్
తిరుపతి జిల్లా భాకరాపేటలో నకిలీ CI హల్చల్ చేశాడు. అన్నమయ్య జిల్లాకు చెందిన కురబోతుల శివయ్య (33) తాను కడప స్పెషల్ బ్రాంచ్ CIనని నమ్మబలికాడు. స్థానిక గొడవల్లో జోక్యం చేసుకుని బెదిరించాడు. ఒకరి దగ్గర బంగారు ఉంగరాన్ని కొట్టేశాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కొందరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశామని భాకరాపేట CI ఇమ్రాన్ బాషా వెల్లడించారు.