టాప్ 100 యాప్స్‌లో అరట్టైకి దక్కని చోటు.. శ్రీధర్ స్పందన
గూగుల్ ప్లే స్టోర్ టాప్ 100 యాప్స్ లిస్టులో అరట్టైకి స్థానం దక్కకపోవడంపై జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు శ్రీధర్ స్పందించారు. 'కొత్త ఉత్పత్తులు కస్టమర్లకు చేరువయ్యే క్రమంలో హెచ్చుతగ్గులు సాధారణమే. నెం.1 స్థానమే గొప్పదని ఎప్పుడూ అనుకోను. ఎలాంటి పరిస్థితులైనా కాలంతో పాటు కనుమరుగవుతాయని ఉద్యోగులకు చెబుతా. వీటిపై దృష్టి పెట్టి తమ సమయాన్ని వృథా చేసుకోవద్దు' అని అన్నారు.