శ్రీరామ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరామ శోభాయాత్ర పోస్టర్ ఆవిష్కరణ

RR: షాద్‌నగర్ పట్టణంలో ఈనెల 27న శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో నిన్న శ్రీరామ శోభాయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు రమేష్ మాట్లాడుతూ.. హిందువుల ఐక్యత ఒక్కటే హిందూ ధర్మ పరిరక్షణకు మార్గమని, యువత ధర్మ రక్షణ, దేశ రక్షణ వైపు నిలబడాలన్నారు.