సీఎం చంద్రబాబుకు అండగా నిలబడాలి: ఎమ్మెల్యే మాధవి

KDP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందని కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డితో కలిసి 27వ డివిజన్ గౌస్ నగర్లో గురువారం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు ఇంటివద్దె పెన్షన్ అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు అండగా నిలబడాలని ఆమె కోరారు.