ప్రమాదవశాత్తు రైతు మృతి

ప్రమాదవశాత్తు రైతు మృతి

SRD: వర్షంలో పొలానికి వెళ్లి రైతు ప్రమాదవశాత్తు మృతి చెందిన సంఘటన హత్నూర మండలం చిక్ మద్దూరు గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన రైతు లక్ష్మయ్య(45) పొలం పనులు చేస్తుండగా వర్షంలో జారి మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.