బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం సీనియర్ నాయకులు పాకాల మనోహర్ మాట్లాడుతూ.. హింస ద్వారా ఏమీ సాధించలేమని, అహింస ద్వారానే ఏదైనా సాధించవచ్చు అని వెల్లడించారు.