విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన
VKB: మర్పల్లి పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు రోడ్డు భద్రతపై ప్రధానోపాధ్యాయుడు అంజిలయ్య, ఎస్సై అబ్దుల్ రావు ఆధ్వర్యంలో శనివారం అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలు నడపాలని అవగాహన కల్పించారు. చిన్నతనం నుంచే ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.