VIDEO: యుద్ధ‌ప్రాతిప‌దిక‌న కూలిన చెట్లు తొల‌గింపు

VIDEO: యుద్ధ‌ప్రాతిప‌దిక‌న కూలిన చెట్లు తొల‌గింపు

విశాఖ: మొంథా తుఫాను కారణంగా విశాఖపట్నంలో గత మూడు రోజులుగా ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల నగరవ్యాప్తంగా భారీగా చెట్లు కూలిపోయాయి. అయితే, అధికార యంత్రాంగం వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. జీవీఎంసీ సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి, కూలిపోయిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగించారు. జీవీఎంసీ పరిధిలో 134 చెట్లు కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.