గిరిజన గ్రామాల్లో పర్యటించిన నీతి అయోగ్ బృందం

మన్యం: భామిని మండల పరిషత్ కార్యాలయంలో ఐటీడీఏ అధికారులు, మండల అధికారులతో నీతి అయోగ్ బృందం శుక్రవారం పీఎం జన్ మన్ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మండలంలోని సన్నాయిగూడ, నల్లరాయిగూడ, పాలిష్కోట గ్రామాలలో నీతి అయోగ్ బృందం పర్యటించారు. ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతులపై మండల అధికారులకు వివరాలు అడిగి తెలుసుకున్నారు.