BREAKING: పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1200 పెరిగి రూ.1,58,620కు చేరగా.. ఆభరణాలకు వాడే 22 క్యారెట్ల ధర రూ.1100 పెరిగి రూ.1,45,400గా పలుకుతోంది. మరోవైపు వెండి ధర కిలోపై రూ.4000 పెరిగి రూ.2,80,000కు చేరింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.