VIDEO: జిల్లాలో మోస్తారు వర్షం
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి వర్షం పడింది. ఉదయం నుంచి తీవ్ర ఎండ ఉండగా, మధ్యాహ్నం కురిసిన ఈ వర్షంతో ప్రజలు ఉపశమనం పొందారు. కాగా, పంట చేతికొచ్చే సమయంలో ఈ వర్షం తమకు తీవ్ర నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందని మిర్చి రైతులు ఆందోళన చెందుతున్నారు.