VIDEO: రహదారిపై ప్రమాదకరంగా గుంత.. వాహనదారులు ఇబ్బందులు

VIDEO: రహదారిపై ప్రమాదకరంగా గుంత.. వాహనదారులు ఇబ్బందులు

SRPT: నడిగూడెం మండలం ఎక్లాస్ ఖాన్ పేట గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడటం వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఈ రహదారి గుండా అనేక గ్రామాల ప్రజలు కోదాడ కి ప్రయాణిస్తుంటారు. రహదారిపై ప్రయాణించి వాహనదారులు ఏమాత్రం అలసత్వం వహించినా ప్రమాదాల బారినపడే అవకాశం ఉంది. వెంటనే సంబంధిత అధికారులు గుంతను పూడ్చివేయాలని స్థానిక ప్రజలు,వాహనదారులు కోరుతున్నారు.