అక్రమంగా తరలిస్తున్న నల్లబెల్లం పట్టివేత

MHBD: డోర్నకల్ మండలం తొడేళ్ళ గూడెం గ్రామంలో సోమవారం అక్రమంగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 30 క్వింటాళ్ల నల్ల బెల్లం, 5 క్వింటాల పట్టిక పోలీసులు పట్టుకున్నారు. బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.