కోడిపందేలు ఆడుతున్న వారిపై కేసు నమోదు
VZM: ఎల్.కోట పోలీసు స్టేషన్ పరిధి దాసుళ్ళపాలెం గ్రామ శివారు కోడిపందేలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఎస్సై నవీన్ పడాల్ మంగళవారం తెలిపారు. వారి నుండి రెండు కోడిపుంజులు, రూ.12,200 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పోలీసు స్టేషన్ పరిధిలో తీర్థాల పేరుతో కోడిపందేలు, గుల్లాట నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.