ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు: జేసీ

WG: కాలువలు, చెరువు గట్లపై ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ శుక్రవారం ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి "వాచ్ డాగ్" కమిటీ సమీక్ష చేశారు. జిల్లా వ్యాప్తంగా 361.86 ఎకరాల ఆక్రమణలు ఉన్నాయని వాటిని తొలగించాలని ఆదేశించారు.