నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన జిల్లా ఏఎస్పీ

నర్సింగ్ విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన జిల్లా ఏఎస్పీ

BDK: భద్రాచలంలో నర్సింగ్ చదువుతూ.. ఆర్థిక పరిస్థితులు బాగా లేక కూలి పనులకు వెళ్తున్నా ఓ విద్యార్థికి జిల్లా ఏఎస్పీ విక్రాంత్ అండగా నిలిచారు. శనివారం భద్రాచలం మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ. 22 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలో ఆపకూడదనే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేసినట్లు తెలిపారు.