రేపు విజయవాడకు జగన్
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు. భవనీపురంలో అధికారులు ఇటీవల కూల్చిన 42 ఫ్లాట్లను పరిశీలించేందుకు విజయవాడ వెళ్తున్న ఆయన.. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడనున్నారు. ఇప్పటికే పలు మార్లు జగన్‌ను కలిసిన నిర్వాసితులు తమ బాధను ఆయనతో చెప్పుకుని వినతి పత్రాలు సమర్పించిన సంగతి తెలిసిందే.