అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కళాశాలలో రాష్ట్రస్థాయి క్రీడా పోటీలు
SRD: కంది పరిధిలోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాలలో రెండో రోజు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు బుధవారం ఉత్సాహంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ కళాశాల నుంచి వచ్చిన విద్యార్థులకు రంగోలి, ఉపన్యాసం, క్యారమ్స్, చెస్ పోటీలు జరిపించారు. ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరుగుతాయని కళాశాల డీన్ డాక్టర్ స్వామి తెలిపారు.