గ్రామకంఠాన్ని ఆక్రమిస్తున్నారని గ్రామస్థుల ఫిర్యాదు

NLR: ఉదయగిరి (M) గడ్డంవారిపల్లి గ్రామకంఠానికి సంబంధించిన స్థలాన్ని కొంతమంది ఆక్రమిస్తున్నారని సోమవారం ఉదయగిరి MRO కార్యాలయంలో జరిగిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. వారు మాట్లాడుతూ.. గ్రామ కంఠంలోని స్థలాన్ని అడ్డగించి ఎరువు దిబ్బలు వేయడం వల్ల అటువైపు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాటిని పరిష్కరించాలని కోరారు.