నిమిషాల వ్యవధిలోనే తల్లీ కొడుకు మృతి

నిమిషాల వ్యవధిలోనే తల్లీ కొడుకు మృతి

విశాఖ: జిల్లాలో హృదయ విదారక ఘటన జరిగింది. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న తల్లి పరిస్థితి చూసి కుమారుడు గంగరాజు (41) కుప్పకూలి మృతిచెందాడు. కొద్దిసేపటికే తల్లి లక్ష్మమ్మ (65) కూడా ప్రాణాలు విడిచింది. జీవీఎంసీ 89వ వార్డు కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన ఈ తల్లీ కుమారుల మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.