'పవన్ సూచన మేరకు ప్రాజెక్టు రూపొందించాం'
AP: డిప్యూటీ సీఎం పవన్ సూచనల మేరకు హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు రూపొందించినట్లు అటవీశాఖ పేర్కొంది. దీని కోసం ప్రత్యేకమైన యాప్ తయారు చేసినట్లు తెలిపింది. జంతు సంరక్షణ, పునరావాసం కోసం ప్రత్యేక వాహనాలు ఇస్తున్నట్లు చెప్పింది. ఏనుగుల వల్ల పంటనష్టం జరిగితే ఇచ్చే పరిహారం భారీగా పెంచినట్లు వెల్లడించింది. ఏఐ సాయంతో వన్యప్రాణులను అడవుల్లోకి పంపించే చర్యలు చేపట్టినట్లు తెలిపింది.