అమరాపురం చెరువులో కంప చెట్లు తొలగింపు
సత్యసాయి: అమరాపురం చెరువుకు కృష్ణా జలాలు త్వరలో వస్తున్నాయని మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తెలిపారు. ఆదివారం కృష్ణా జలాల తరలింపుకు వీలుగా అమరాపురం చెరువు కాల్వ సమీపంలో దట్టంగా పెరిగిన కంపచెట్లను జేసీబీతో తొలగించారు. తిప్పేస్వామి మాట్లాడుతూ.. త్వరలోనే అమరాపురం రైతుల కళ్లల్లో ఆనందం నింపుతామని తెలిపారు.