పీజీఆర్ఎస్‌కు అర్జీలు వెల్లువ

AKP: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సమస్యలపై వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 94 అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించిన కలెక్టర్ వాటిని సంబంధిత అధికారులకు పంపించి తక్షణం పరిష్కరించాలని ఆదేశించారు.