రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి
WGL: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన దుగ్గొండి మండలంలో గురువారం జరిగింది. గిర్నిబావి గ్రామానికి చెందిన యాకుబ్ పాషా రోడ్డు దాటుతుండగా వరంగల్ నుంచి నర్సంపేట వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యాకుబ్ తీవ్రంగా గాయపడి ఘటన స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.