బొల్లవరంలో కొండచిలువ కలకలం

నంద్యాల: మహనంది మండలం బొల్లవరం గ్రామంలో కొండచిలువ గురువారం కలకలం రేపింది.12 అడుగులు కొండచిలువను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొండచిలువను చూసిన స్థానికులు స్నేక్ స్నాచర్ మోహన్ కు సమాచారం అందించారు.కొండచిలువను పట్టుకొని సంచిలో బంధించి స్నేక్ స్నాచర్ మోహన్ అడవిలో వదిలేశాడు. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.