నీటి కష్టాలు తీర్చిన మాజీ సర్పంచ్

నీటి కష్టాలు తీర్చిన మాజీ సర్పంచ్

NLG: నాంపల్లి మండలం నర్సింహులగూడెం స్థానిక ప్రజలు గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక మాజీ సర్పంచ్ కాటం వెంకటయ్య ప్రజల నీటి దాహం తీర్చాలని తన సొంత ఖర్చులతో బోరు వేయించి, శనివారం మోటార్ బిగించారు. దీంతో ప్రజల నీటి కష్టాలు తీర్చినందుకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.