మూడు నెలల బియ్యం ఒకేసారి.. సర్వం సిద్ధం..!
MDCL: ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి ఏప్రిల్ నెలలో అందించనున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా ఉప్పల్ పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ASO సంధ్య మాట్లాడుతూ.. ప్రతి లబ్ధిదారుడికి మూడు నెలలకు సంబంధించి ఒక్కొక్కరికి 18 కిలోల రేషన్ బియ్యం అందుతుందన్నారు.