గంగాధర నెల్లూరు టీడీపీలో వర్గ పోరు

CTR: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు ముదురుతోంది. ఎమ్మెల్యే థామస్ పీఏను తొలగించాలని ఒక వర్గం నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. మరో వర్గం ఆయనను తొలగించవద్దని కోరుతూ జిల్లా టీడీపీ కార్యాలయానికి చేరుకుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని జిల్లా నాయకత్వం హెచ్చరించింది.