రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: జగ్గయ్యపేటలో రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బలుసుపాడు రోడ్డు ఈద్గా మైదానంలో ముస్లిం సోదరులు అల్లాహ్ కృప కోసం సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. వేలాది మంది పాల్గొన్న ఈ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.