పెడనలో పట్టభద్రుల ఎన్నికపై అవగాహన ర్యాలీ

కృష్ణా - గుంటూరు పట్టభద్రుల ఎన్నికల నేపథ్యంలో పెడన పట్టణంలో శనివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ అనిల్ కుమార్ నేతృత్వంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఓటింగ్ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ర్యాలీ ముగిసిన అనంతరం ఓటర్లను ప్రత్యేకంగా సమీకరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు.