ఈనెల 15న కలెక్టరేట్ వద్ద ధర్నా
ELR: ఈనెల 15న ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాని జయప్రదం చేయాలని పెదవేగి మండలం కూచింపూడిలో నిర్మాణరంగ కార్మికులు గోడ పత్రికలు బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన IFTU ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ.. నిర్మాణారంగా కార్మిక హక్కులను పరిరక్షించాలన్నారు. కార్మిక హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్నారు.