ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి మృతి
ADB: బోథ్ మండలంలో విషాదం నెలకొంది. ఆదివారం ఎస్సై పురుషోత్తం వివరాల ప్రకారం.. మండలంలోని కరత్వాడ గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్(12) తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న క్రమంలో బంతి పక్కన గల కాలువలో పడగా బంతి కోసం వెళ్ళిన షేక్ ఇమ్రాన్ ప్రమాదవశాత్తు కాలువలో పడి మరణించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బోథ్ ఎస్సై తెలిపారు.