ఖిల్లా అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి

NLG: దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్‌ను విద్యార్థి సంఘ నాయకులు శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దేవరకొండ ఖిల్లా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరుతూ శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ జనసేన విద్యార్థి విభాగం అధ్యక్షుడు వినోద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.