VIDEO: పెట్రోల్‌లో నీరు.. వినియోగదారుడి ఆందోళన
HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామ శివారులోని ఓ పెట్రోల్ బంక్‌లో మంగళవార బైక్‌లో పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత కొంత దూరం వెళ్లగానే వాహనం ఆగిపోయింది. మెకానిక్ పరిశీలనలో పెట్రోల్‌లో నీరు కలిసినట్లు వెల్లడైంది. దీనిపై బంక్ నిర్వాహకులను నిలదీయగా వారు అమర్యాదగా ప్రవర్తించారని బాధితుడు సాయికుమార్ ఆరోపించారు.పెట్రోల్ పంప్‌పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్.