VIDEO: వృథా అవుతున్న తాగునీరు.. ఇబ్బందుల్లో ప్రజలు..!
KDP: కమలాపురం నగర పంచాయతీ క్రాస్ రోడ్ వద్ద వారం రోజులుగా పైపులైన్ లీకేజీ కారణంగా వేల లీటర్ల తాగునీరు వృథా అవుతోంది. ఏ పైపు లీక్ అవుతుందో గుర్తించకుండా అధికారులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేసవి కాలంలో నీరు ఇలా రోడ్డుపాలు కావడంపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.