ఇళ్ల గణన పకడ్బందీగా నిర్వహిస్తాం: కలెక్టర్
MHBD: జనగణనలో భాగంగా ఇళ్ల గణన పారదర్శకంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ స్నేహ శభరీష్ అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ఇళ్ల గణన కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై ఉన్నతధికారలు నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారుల సమన్వయంతో పకడ్బందీగా నిర్ణయిస్తామన్నారు.