VIDEO: 'ఎన్నికల్లో చెప్పినట్లుగానే జిల్లా ఏర్పాటు'
ప్రకాశం: ఎన్నికల్లో చెప్పినట్లుగానే మార్కాపురం జిల్లాను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పకొచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు కోసం స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆరోగ్యం బాగో లేకపోయినా కానీ పాదయాత్రలు చేశారని, త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే హార్టికల్చర్ హబ్బుగా తీర్చిదిద్దుతామన్నారు.