ఇసుక డంపు సీజ్

NZB: కోటగిరి మండలం రాంపూర్ శివారులో ఓ ఇటుక బట్టీలో అక్రమంగా నిల్వ ఉంచిన 25 ట్రిప్పుల ఇసుకను శుక్రవారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కొందరు ఇసుకను రహస్య స్థావరాలకు తరలించి పెద్ద మొత్తంలో డంపు చేస్తున్నారు. రాత్రి వేళలో దూర ప్రాంతాలకు అక్రమంగా టిప్పర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.