పరీక్షా కేంద్రాలను సందర్శించిన ఎస్పీ

సిరిసిల్ల: జిల్లా పరిధిలో ఉన్న 25 గ్రూప్ -3 పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాటు చేసామని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద రూట్ లలో ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి, ఎస్ఐ స్థాయి అధికారులను నియమించామన్నారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణంలోని పలు పరీక్ష కేంద్రలను పరిశీలించి బందోబస్తులో ఉన్న అధికారులకు పలు సూచలు చేశారు.