నిరంతరం వర్షాలతో రైతుల ఆందోళన
NTR: ఇటీవల పడుతున్న నిరంతర వర్షాలతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అధిక వర్షాలతో ప్రతి పంట చేతికి రాలేదని, వరి పంటకు అవసరమైన సస్యరక్షణలు చేపట్టి నోటికాడికి వచ్చిన సందర్భంలో మళ్లీ వర్షాలు వచ్చి నాశనం చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం పడుతున్న వర్షాలతో వరి కింద పడిపోయి ధాన్యం రంగు మారుతుందని, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు.