లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేసిన మాజీమంత్రి
MHBD: జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సోమవారం పలువురు CMRF లబ్ధిదారులకు రూ.1,31,500 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైద్య ఖర్చులకు ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.