రైతులే నిజమైన సంరక్షకులు
ELR: రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు రైతులే, కాబట్టి కొత్త ఆలోచనలు పంచుకుంటూ రైతులకు మార్పు రావాలని మండల కూటమి నేతలు తెలిపారు. రైతు పండించే ప్రతి పంట మన రాష్ట్రానికి బలమని, ఈ రాష్ట్రానికి నిజమైన సంరక్షకులు రైతులే అని వెలేరుపాడు మండల కూటమి నాయకులు అన్నారు. మండలంలోని మేడేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అధికారులతో నిర్వహించిన రైతుల వర్క్‌షాప్‌లో భాగంగా ఈ సమావేశం జరిగింది.