'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

'ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి'

WNP: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం వనపర్తి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ, ఫిర్యాదు దారులకు తగిన సమాచారం అందించాలన్నారు.